
ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజు సాయంత్రం పూట కాస్తయినా ఉపశమనం కలిగించేది ఐపీఎల్. కానీ ఇప్పడు ఆ లీగ్ కూడా ఇదే కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్తే. అయితే ఇంత షాక్ లోనూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి కాస్త ఊరట చెందుతున్నారు ఐపీఎల్ అభిమానులు. లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ వరద పారిస్తున్నారు. ఇప్పుడెలా టైం పాస్ చేయాలని ఒకరు మా ఆత్మాభిమానాన్నే లాగేసుకున్నారని మరొకరు ట్వీట్స్ చేస్తున్నారు.