https://oktelugu.com/

Viral Video : బంధువులను, ఊళ్లో వాళ్లందరినీ పిలిచి అట్టహాసంగా కారును సమాధి చేసిన రైతు కుటుంబీకులు.. ఎక్కడంటే ?

అమ్రేలిలోని లాథి తాలూకాలోని పదర్శింగ గ్రామానికి చెందినది. ఇక్కడ నివాసి సంజయ్ పొల్లారా, అతని కుటుంబం గురువారం అతని అదృష్ట కారును పాతిపెట్టారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 9, 2024 / 03:21 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video : గుజరాత్‌లోని అమరిల్ జిల్లా నుండి ఒక ప్రత్యేక ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ వారి 15 ఏళ్ల ‘లక్కీ’ కారును ఓ రైతు కుటుంబం మరొకరికి అమ్మడానికి బదులుగా దానిని వారి పొలంలోనే పాతిపెట్టింది. తద్వారా దాని జ్ఞాపకాలు వారి దగ్గరే అలాగే మిగిలి పోతాయని వారి నమ్మకం. అంతేకాకుండా ఇప్పటి వరకు వారికి సేవలందించిన కారు కూడా వారి దగ్గరే ఉందన్న భరోసా ఉంటుందని ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు తమ లక్కీ కారును అంగరంగ వైభవంగా తమ పొలానికి తీసుకొచ్చి సమాధి ఇచ్చిన అనంతరం దాని జ్ఞాపకార్థం కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.

    ఈ కేసు అమ్రేలిలోని లాథి తాలూకాలోని పదర్శింగ గ్రామానికి చెందినది. ఇక్కడ నివాసి సంజయ్ పొల్లారా, అతని కుటుంబం గురువారం అతని అదృష్ట కారును పాతిపెట్టారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు సహా పరిసర ప్రాంతాల నుంచి సుమారు లక్షన్నర మంది పాల్గొన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబానికి ఇన్నాళ్ల పాటు ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూసుకున్న అదృష్ట కారు చెట్టు కింద ఉందని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా సమాధి వద్ద ఒక చెట్టును నాటుతామని కుటుంబం చెబుతుంది. కారు ఖననం వేడుకకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పోలారా, అతని కుటుంబ సభ్యులు తమ పొలంలో కారు కోసం తవ్విన గొయ్యిలో మంత్రాలు పఠిస్తూ కనిపించారు. అలాగే, అతని 15 ఏళ్ల వ్యాగన్ఆర్ కారును పువ్వులు, దండలతో అందంగా అలంకరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

    కారును భూమిలో పాతిపెట్టేందుకు పోలారా కుటుంబీకులు తమ పొలంలో దాదాపు 15 అడుగుల లోతున గొయ్యి తవ్వి, కారును సులభంగా తీసుకెళ్లేందుకు ఆ గుంతలో వాలు కూడా వేశారు. ఆ తర్వాత కారును రివర్స్‌ చేసి ఆ వాలు గుండా గుంతలోకి తీసుకెళ్లి ఆకుపచ్చని కవర్‌ వేసి పూజలు చేసి గులాబీ పూల రేకుల వర్షం కురిపించి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో అక్కడ ఉన్న పూజారులు మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు. చివరికి అక్కడికి పిలిచిన జేసీబీ సాయంతో కారును మట్టితో పూడ్చి శాశ్వతంగా పాతిపెట్టారు. ఈ వ్యాగన్ఆర్ కారు నంబర్ GJ05-CD7924.

    కారు యజమాని సంజయ్ పోలారా సూరత్‌లో కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారని, ఈ ఈవెంట్‌కు సంబంధించి, రాబోయే తరాలు తమ కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టిన కారును గుర్తుంచుకునేలా విభిన్నంగా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పొల్లారా విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను ఈ కారును 15 సంవత్సరాల క్రితం కొన్నాను. అది వచ్చిన తర్వాత నా కుటుంబానికి అంతా మంచి జరిగింది. వ్యాపారంలో విజయంతో పాటు నా కుటుంబానికి కూడా గౌరవం లభించింది. ఈ కారు నాకు.. నా కుటుంబానికి అదృష్టమని నిరూపించబడింది. అందుకే దాన్ని అమ్మకుండా నా పొలంలో పాతిపెట్టాను. కారు, ఇతర కార్యక్రమాలకు సమాధి కట్టేందుకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు పోలారా తెలిపారు. సమాధి వద్ద ఒక చెట్టును నాటాలనుకుంటున్నట్లు, రాబోయే తరాలు గుర్తుంచుకునేలా కుటుంబం అదృష్ట కారు ఈ చెట్టు కింద ఉందని చెప్పారు. సమాధి వేడుక హిందూ ఆచారాల ప్రకారం సాధువులు, మత పెద్దల సమక్షంలో జరిగింది. దీని కోసం సుమారు 1,500 మందిని ఆహ్వానించారు. చాలా గ్రాండ్ గా విందు కూడా ఏర్పాటు చేశారు.