
టీమ్ ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రిషబ్ పంత్ (25) ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 50వ ఓవర్ లో వరుసగా ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదిన పంత్ ఆఖరి బంతికి పెవిలియన్ చేరాడు. అతడు ఆడిన షాట్ ను బెయిర్ స్టో క్యాచ్ అందుకోవడంతో భారత్ 145 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.