
ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కరోనా నియంత్రణ టీకా కొవాగ్జిన్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రబుత్వాతు ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు ఒక్కో డోసు ధర రూ. 600 లు కాగా ప్రైవేటు ఆస్పత్రులను సరఫరా చేసే వ్యాక్సిన్ ధరను రూ. 1200 లు గా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని వెల్లడించింది.