
అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు 30శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలతో అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 10,500 నుంచి రూ. 13,650కి పెరగనుంది. మినీ అంగన్వాడీ టీచర్లు వేతనం రూ. 6వేల నుంచి రూ. 7,800లకు పెరగనుంది. అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ. 6వేల నుంచి రూ. 7,800లకు పెరగనుంది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.