
కోవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు తమ అత్మీయులను కోల్పోయిన విచారం, బాధలో ఉన్నారని ఒక ప్రధాన సేవక్ గా వారి బాధను తాను పంచుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఎనిమిదో ఇన్ స్టాల్ మెంట్ ను ప్రధాని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కనబడని శత్రువు తో పోల్చారు. ప్రజలు తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని కోరారు.