Hydra Jubilee Hills: హైడ్రా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఆక్రమణలను కట్టడాలను కూల్చివేసింది. నాలా పై నిర్మించిన నిర్మాణాలు, షెడ్లను కూల్చివేశారు. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు. ఘటన స్థలం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్రమ నిర్మాణ కిరాయిదారుడి వ్యవహారంపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే నోటీసులు సవాల్ చేస్తూ కిరాయిదారుడు కోర్టును ఆశ్రయించాడు. కిరాయిదారుడికి నిర్మాణాలపై ఎలాంటి హక్కు లేదని కోర్టుు చెప్పింది. దీంతో హైడ్రా నిర్మాణాలను కూల్చివేసింది.