Horoscope Today: 2024 ఏప్రిల్ 10 బుధవారం రోజున ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారికి కొన్ని కష్టాలు ఉంటాయి. మిథునం రాశివారికి ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. రోజూవారీ ఖర్చులు తీర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు రావు.
వృషభ రాశి:
ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఒత్తిడికి గురి కావడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఏదైనా ఒప్పందంపై ఆలోచించాలి.
మిథునం:
ఓ సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్యంపై దృష్టి పెడితె అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈ రాశివారు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. బయటి వ్యక్తుల సలహాలు తీసుకోవద్దు. ఉద్యోగాలు చేసేవారు అధికారులతో సమన్వయంతో ఉండాలి.
సింహ:
ఈ రాశివారు ఈరోజు ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు ఇతరులను నమ్మకుండా ఉండాలి.
కన్య:
కొత్త వాహనం కొనుగోలు చేయడానికి రెడీ అవుతారు. కుటుంబ సమస్యలు ఇతరులకు చెప్పకుండా ఉండండి. విద్యారంగానికి చెందిన వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
తుల:
కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
వృశ్చికం:
ఓ వస్తువును బహుమతిగా పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది.
ధనస్సు:
ఎక్కువగా వాగ్దానాలు చేయొద్దు. ప్రత్యేక సందర్భాల్లో ముందుకు వెళ్తారు. వ్యాపారవేత్తలు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. ఉద్యోగులు సీనియర్ సభ్యులకు అనుగుణంగా ఉంటారు.
మకర:
ఖర్చులను నియంత్రించాలి. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. దూర ప్రయాణాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
కుంభం:
ఆదాయం బాగుంటుంది. అయితే ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగులు ఆహ్లదకరమైన వాతావరణాన్ని గడుపుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి.
మీనం:
ఆదాయం, ఖర్చులు సమపాళ్లల్లో ఉంటాయి. కొన్ని ఆలోచనలు ప్రయోజనాలు పొందుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇచ్చిన అప్పులు వసూలవుతాయి.