Horoscope Today: 2024 ఏప్రిల్ 3న ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో వృషభ రాశివారు ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. కర్కాటక రాశివారు ఉల్లాసంగా ఉంటారు. బుధవారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. కటుుంబ సభ్యలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. పాత స్నేహితులు కలవడంతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరమైన చిక్కుులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లయితే తిరిగి ఇవ్వగలుగుతారు.
మిథునం:
సామాజిక అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అదనపు ఆదాయం చేకూరుతుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాలపై ఆందోళనగా ఉంటారు.
సింహ:
వ్యాపారులు భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు.
కన్య:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రశంసలు వస్తాయి. పెండింగులో ఉన్న పనులు నేటితో పూర్తవుతాయి. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.
తుల:
కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. కొత్త వస్తువుల కొనుగోలుపై చర్చిస్తారు.
వృశ్చికం:
కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉంటున్న వారి నుంచి శుభవార్తలు వింటారు. ఓ పని విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు.
ధనస్సు:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం ఉంటుంది. ఒత్తిడి నుంచి బయటపడుతారు. శత్రువులు వేసే పన్నాగాలను జయించుతారు.
మకర:
స్నేహితుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వస్తారు. సామాజిక రంగాల వారికి అనుకూల వాతావరణం. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కుంభం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఇవి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.
మీనం:
గతంలో పెండింగులో ఉన్న పనులు నేటితో పూర్తవుతాయి. భవిష్యత్ కోసం కొత్త పెట్టుబడులు పెడుతారు.కొందరి నుంచి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.