
న్యాయస్థానాలు తమకున్న అధికారాలను విచక్షణాయుతంగా వినియోగించాల్సి ఉంటుందని, అయితే కొన్ని హైకోర్టులు తగు పరిశీలన చేయకుండానే ఆదేశాలు జారీ చేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్, ఉత్తరాఖండ్ హైకోర్టులను ఉదహరిస్తూ జస్టిస్ డి. వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం. ఆర్. షా లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ హత్య కేసులు దాఖలైన ఎఫ్ ఐఆర్ ను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలైంది. సోమవారం దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఐపీసీ 302 సెక్షన్ కింద ఎఫ్ఆర్ దాఖలైంది. ఆగస్టు 10 వ తేదీ కల్లా ఆ వ్యక్తి లొంగిపోవాలని ఆదేశించింది. బెయిల్ పై ఆదే రోజు నిర్ణయం తీసుకుంటానంది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సెషన్ కోర్టు అదే రోజు బెయిల్ పై విచారణ జరపవచ్చని పేర్కొంది. ఇది ఘోరమైన ఆదేశం అని మండిపడింది.