
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో అనుమతించవద్దని, వాటిని కేవలం ప్రత్యేక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలు నిమజ్జనం చేయాలంది. మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని సూచించింది.