Harish Rao: బీఆర్ఎస్ అధికేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లలోని నివాసంలో ఆయన్ను కలిశారు హరీశ్ రావు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతీ తెలిసిందే. ఆయనతో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కూడా నోటీసులిచ్చింది.