
కొవిడ్ నివారణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, బుగ్గన, కన్నబాబు, సలహాదారు సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పీడియాట్రిక్ లో వైద్య సిబ్బందికి శిక్షణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జనావాసాలకు దగ్గరగా హెల్త్ హాబ్ లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. థర్డ్ వేవ్ లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించిన ఆయన అర్హలైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.