
తెలంగాణలో కరోనా లాక్ డౌన్ విధించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల అన్ని రకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది.