
మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ తెలిపారు. కొవిడ్, ఉపాధి హామీ పనులు, అర్బన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, ఖరీఫ్ సన్నద్ధతపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు జీవితంలో భాగం కావాలని సూచించారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు.