
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుండగా.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజుకు 2వేల చొప్పున టోకెన్లను ఇస్తమంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లను ఇవ్వనుండగా.. త్వరలో మిగతా జిల్లాల వారికి టోకెన్లను ఇవ్వనుంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రూ. 300 టికెట్ ఉన్నవారినే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.