
తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గాంధీభవన్ ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ నిరసనకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ క్షరశాలుమూతపడడంతో వృత్తిదారులు చాలా కష్టాలు పడ్డారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించి ఆదుకోవానలి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 30 మోడ్రన్ సెలూన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పరని ఇంతవరకు ఒక్కడి కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నాయిీ బ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.