
సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న బుల్లెట్ బండి పాటకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్టెప్పులేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్ చేస్తుంటే బుల్లెట్ బండి పాట రాగానే ఆయన కూడా స్టేజ్ పైకి వెళ్లి కాలు కదిపారు. ప్రస్తుతం రాజయ్య డ్యాన్స్ వైరల్ అవుతోంది.