
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆహారం వికటించి 41 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితులు దవాకానలో చికిత్స పొందుతున్నారు. కాగా నలుగురిని ఉట్నూర్ దవాఖానకు తరలించారు. ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్ బాధితులకు వైద్యం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.