బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు పలు రకాల కారణాలో మరణించడంతో సినీ పరిశ్రమకు తీరని లోటుగా ఏర్పడుతోంది. తాజాగా ప్రముఖ టెలివిజన్ నటి లీనా ఆచార్య కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె గత కొద్ది రోజులుగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ‘ఆప్ కే జానే సే’, ‘మేరీ హానీ కారక్ బీవీ’ అనే సీరియల్స్ లో లీనా నటించి మెప్పించారు. అలాగాే ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. రాణీ ముఖర్జీ నటించిన హిచ్కీ తో పాటు పలు సినిమాల్లోనూ కూడా నటించారు.