
దేశంలోని ప్రతి ఒక్కరూ హిందువేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. భారత్ లో హిందువులు, ముస్లింల మూలాలన్నీ ఒక్కటే అని పేర్కొన్నారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలవాలన్నారు. హిందువులు ఎవరి పై శత్రుత్వం చూపరని, దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.