
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ బండి సంజయ్, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు. ఈటలను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన భాజపాలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయిదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్ వెళ్లి వచ్చాక భాజపాలో చేరతారని నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.