
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కుదురుకుంటుంది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో ఓలీ పోప్, జానీ బెయిర్ స్టోలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 109 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ టీమిండయా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది.