
జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగర్ భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అనంత్ నాగ్ జిల్లా కొకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైన్యం పై కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో ఒక ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజేపీ వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.