
ఒడిశాకు చెందిన బీజేడీ పార్లమెంట్ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలైంది. కేసు నమోదైన విషయాన్ని పీఎస్ ఎస్ హచ్ ఓ ధ్రువీకరించారు. కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మహతాబ్ పై రాజధాని నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కేసులో ఆయన భార్య మహాశ్వేత, కుమారుడు లోకరంజన్ పై కూడా కేసు దాఖలైంది. భర్తృహరి మహతాబ్ కోడలు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.