Donald Trump
Donald Trump : అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలను భయపెడుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు స్వదేశంలోని తన వ్యతిరేకులను టార్గెట్ చేశారు. నిన్నటి వరకు అక్రమ వలసదారులను తరలించడం, కెనడా(Canada), మెక్సికో(Mexico), చైనా(Chaina) ఉత్పత్తులపై సుంకాలు 25 శాతం పెంచారు. స్టీల్, అల్యూమునియం దిగుమతులపై సుంకాలు విధించారు. ఇక జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు చేశారు. ఇలా సంచలన నిర్ణయాలతో ప్రపచం దేశాలను భయపెడుతున్నారు. తాజాగా సొంత దేశంలోని న్యాయమూర్తిలపై పడ్డారు. ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులు ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారు. ఈ విషయాన్ని ఇంటర్షేనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజినీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్(Mathyu Bigs) తెలిపారు. ట్రంప్ నిర్ణయాలపై కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యాజ్యాలపై స్పందించిన ట్రంప్..‘తన దేశాన్ని కాపాడుకునేవారు ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అని పేర్కొంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బొనపార్టే కొటేషన్‌ను ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు.
ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల జారీ
జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో కీల నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దులను మూసివేయడం, అమెరికా మెక్సికో మధ్య గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు పెంచడం ఇలా మెరుపు వేగంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.
ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాజ్యాలు..
ఇదిలా ఉంటే.. ట్రంప్ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై అంతే వేగంగా కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. లింగమార్పిడి వ్యక్తులు సైన్యంలో పనిచేయడాన్ని నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం తదితర అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలను సవాల చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో అక్రమ వలసలపై అణచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏడు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు 2021 జనవరిలో క్యాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో ఉన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లు వెల్లడించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్‌పై పలు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
నెపోలియన్‌ను ప్రస్తావిస్తూ..
వరుస పరిణామలతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడని పేర్కొన్నాడు. తతను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు నెపోలియన్ 1804లో కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించాడు. ట్రంప్ ఇప్పుడు నెపోలియన్ కోట్స్‌ను ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో నిరంకుశ పాలనను సమర్థిస్తూ ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్‌ను వినిపిస్తున్నారు. కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. న్యాయమూర్తులపై దాడిచేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహకవర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు అని ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్ గతంలో ట్వీట్ చేశారు.