
గుంటూరు జిల్లాలోని ఐఎంఏ అసోసియేషన్ హల్ వద్ద వైద్యులు నిరసనకు దిగారు. వైద్య సిబ్బందిపై దాడులకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్ లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి నంద కిషోర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు పెరిగి పోయాయన్నారు. నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదని నిరసన మాత్రమే తెలియజేస్తున్నామన్నారు.