
వైసీపీ ఆఫీస్ లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందర్య మందును ఎంపీ విజయసాయిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడతూ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ 22 వేల మంది ప్రాణాలకు తెగించి విశాఖలో పని చేశారన్నారు. ఆనందయ్య మందుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందన్నారు. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అందిస్తున్నామన్నారు. రెండవ విడతలో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఆనందయ్య మందు అందిస్తామన్నారు.