
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రోహిత్ దామోదరన్ అనే క్రికెటర్ తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి విచ్చేసి వధూవరులకు అభినందనలు తెలిపి వాళ్లని ఆశీర్వదించారు. ఆనంతరం వధూవరులు, ఇరు కుటుంబ పెద్దలతో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.