Mahesh Babu
Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం రాజమౌళి(Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎంటైర్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేయాలని రాజమౌళి విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక దాంతో పాటుగా మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం భారీ ఎత్తునా కష్టపడాల్సిన సమయమైతే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ వరల్డ్ లో తనను మించిన నటుడు మరొకరు ఉండరు అనే రేంజ్ లో సత్తా చాటుకున్న వాడవుతాడు. అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారి హాలీవుడ్ గడ్డమీద జండ ఎగరేసిన హీరో కూడా మహేష్ బాబు అవుతాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా కోసం ఆచూతూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇద్దరు కలిసి ఒక పెను ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజమౌళి చాలా సీరియస్ గా తీసుకొని మరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు… ఒక్క ఫ్లాప్ కూడా లేని రాజమౌళి ఈ సినిమాతో ఇంతకుముందు ఎంత గుర్తింపైతే వచ్చిందో అంతకుమించి స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక మహేష్ బాబు సైతం ఇప్పటివరకు ఏ సినిమాకి కష్టపడని రేంజ్ లో ఈ సినిమా కోసం పడుతున్నాడు. ఒళ్ళు హూనమయ్యే విధంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. అయితే గతంలో మహేష్ బాబుతో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తానని చెప్పి స్టోరీని కూడా వినిపించి ఆ తర్వాత సినిమా చేయకుండా ఆపేశాడు. దానికి ఆ దర్శకుడు మహేష్ బాబుకి సారీ కూడా చెప్పాడని గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటి? అంటే… సంచలన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సింది.
అంత సిద్ధమైన తర్వాత అది మహేష్ బాబుకి కూడా వినిపించి ఒకే చేయించుకున్నాడు. మళ్లీ తనలో తానే ఆలోచించుకున్న వర్మ ఈ కథ మహేష్ బాబుకు సెట్ అవ్వదని అనుకొని, మహేష్ బాబుతో ఇది మీకు వర్కౌట్ కాదని చెప్పి వేరే హీరోతో ఆ సినిమాని చేశాడు. ఇక అప్పటినుంచి మహేష్ బాబు కూడా వర్మ డైరెక్షన్ లో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు…