Ellamma Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు సైతం సక్సెస్ లను సాధిస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు సైతం హీరోలుగా మారాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం హీరో అవతారం ఎత్తిన విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటి వరకు ఆయన పలు సినిమాలకు మ్యూజిక్ ను అందించి వాటిని విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు…ఇంతకు ముందు చాలా సందర్భాల్లో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి అతనికి కథ నచ్చకపోవడంతో అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఎల్లమ్మ లాంటి ఒక డిఫరెంట్ కథ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…ఎల్లమ్మ ముందు డప్పులు కొట్టే క్యారెక్టర్ లో తను నటిస్తున్నట్టుగా తెలుస్తోంది…
అతన్ని ఎల్లమ్మ కోరుకుంటుంది అంటే అతనికి మీదకి ఆవహించి తన నుంచే దేవత తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుందట. కాంతార సినిమాలో ఎలాగైతే రిషబ్ శెట్టి మీదకి దేవుడు అవహిస్తాడో ఈ సినిమాలో సైతం దేవిశ్రీప్రసాద్ మీదకి ఎల్లమ్మ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎల్లమ్మ జాతర సినిమా మొత్తం చూపిస్తారట. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ సైతం డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
దర్శకుడు క్యారెక్టర్ ని ఏ లెవెల్ లో ఎలివేట్ చేస్తాడు. దేవుడి సమక్షంలో ఎలాంటి పాయింట్స్ ని తీసుకొని సినిమాని ఎలా తెరక్కిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొదట్లో దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాలో హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు ప్రతి ఒక్కరు విమర్శించారు.
కానీ గ్లింప్స్ లో దేవిశ్రీప్రసాద్ లుక్కుని చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాకి దేవి సరిగ్గా ససరిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకుంటాడా? లేదంటే ఈ ఒక్క సినిమా చేసి ఆ తర్వాత మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతాడా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…