
మే 2021 సెషన్ డిపార్ట్ మెంటల్ టెస్టులను జూలై 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అంతకుముందు కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాటు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా ప్రధాన కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడల్ లో ఈ పరీక్షలు జరుగుతాయని బుధవారం తెలిపింది.