Delhi Blast Red Fort Explosion : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర గేట్ -1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలో ఉన్న దుకాణాల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత బాంబ్ స్క్వాడ్ బృందాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.
మొదట్లో ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. పేలుడు ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. పేలుడు వల్ల 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరాలు పూర్తిగా చిద్రమయ్యాయి. గాయపడిన వారిని ఎల్ ఎన్ జీ పీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చాలావరకు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో దర్యాప్తు బృందాలు విచారణ మొదలుపెట్టాయి. ఈ పేలుడు వెనక ఉగ్ర ఉందేమోనన్న కోణంలో దర్యాప్తును మొదలు పెట్టాయి. ఆదివారం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విస్తృతంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిని అరెస్టు చేసిన తర్వాత ఒకరోజు వ్యవధిలో ఈ ఘటన జరగడం విశేషం.
ఉగ్రవాదులు మనదేశంలో దాడులు జరపడానికి కుట్రలు పన్నారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తులో తేలింది. పలు ప్రాంతాలలో ఉగ్రవాదులను దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. దీని వెనుక ఉగ్రవాదులు ఉన్నారని దర్యాదు బృందం అధికారులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. దేశ రాజధానిలో పేలుడు జరిగిన నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది.
సరిగ్గా ఆదివారం ఆముదంతో విషయం తయారు చేసే వందల మందిని చంపడానికి కుట్ర చేసిన హైదరాబాద్ ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్, మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఆముదం గింజలను ప్రాసెస్ చేసి.. మిగిలిపోయిన వ్యర్ధాలతో అత్యంత ప్రమాదకరమైన రైసిన్ అనే విష రసాయనాన్ని తయారు చేశారు. ఈ వ్యవహారం దర్యాప్తు బృందం అధికారుల విచారణలో తేలింది.
ఢిల్లీ కారు పేలుడు ఘటనలో 8 మంది మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 15 మంది
తెలియాల్సి ఉన్న పూర్తి వివరాలు https://t.co/VyZ0UVhxbx pic.twitter.com/S11yStp8tZ
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025