
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 39,361 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262 కు చేరాయి. ఇందులో 4,11,189 కేసులు యాక్టివ్ గా ఉండగా, 3,05,79,106 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి వల్ల మరో 4,20,967 మంది మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 416 మంది బాధితులు మరణించారు. 35, 968 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.