
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 19,98,715 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 38,079 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందురోజు కూడా 38వేల కేసులే నమోదయ్యాయి. తాజాగా 560 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరగా 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.