
ఏపీలో గడిచిన 24 గంటల్లో 96,153 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,741 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా నుంచి గత 24 గంటల్లో 10,567 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75,137 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 830 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మంది మరణించారు.