
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,063 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,95,669 కు చేరింది. మరో వైపు 1,929 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,65,657 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా కరోనాతో 11 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో జిల్లాలో నలుగురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,341 యాక్టివ్ కేసులున్నాయి.