Davos Summit 2026 : దావోస్ సమ్మిట్ 2025-26 ముగిసింది. అందరూ తిరుగుబాట పట్టారు. ఈసారి ట్రంప్ ఈ సమ్మిట్ కు రావడంతో ఇది హైలెట్ అయ్యింది. పెట్టుబడుల వేదిక.. రాజకీయ వేదికగా మారింది.
మన దగ్గర నుంచి కేంద్రం నుంచి అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు వెళ్లారు. రాష్ట్రాల నుంచి 10 మంది ప్రతినిధులు వెళ్లారు. 10 రాష్ట్రాలు ఏంటని చూస్తే.. దక్షిణాది నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక వెళ్లాయి. పారిశ్రామిక రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఎవరూ రాలేదు. అక్కడ ఎన్నికలు ఉండడంతో ఎవరూ రాలేదు.. పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరం నుంచి యూపీ, మధ్యప్రదేశ్, తూర్పు నుంచి మొదటి సారి జార్ఖండ్ వెళ్లింది.. ఈసారి ఈశాన్య రాష్ట్రం నుంచి అస్సాం కూడా దావోస్ వెళ్లింది. ఈ 10 రాష్ట్రాల్లో అస్సాం, జార్ఖండ్ మొదటిసారి వచ్చాయి.
రానివి తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్ లు అసలు ఈ దావోస్ సమ్మిట్ లో పాలుపంచుకోలేదు. దావోస్ సమ్మిట్ ప్రాధాన్యతను మనకు చెప్పింది చంద్రబాబు. 90వ దశకం నుంచి ప్రతీసారి చంద్రబాబు ముందు చూపుతో వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు.
2026 దావోస్ సమ్మిట్ లో ఏ రాష్ట్రం విన్నర్ ? ఏ రాష్ట్రానికి పెట్టుబడుల వచ్చాయన్నది ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
