
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహన్నం 2 గంటల వరకు కర్ప్యూ సడలింపు అమలులో ఉంటుంది.