CPM : సీపీఎం.. 1964లో సీపీఐ నుంచి బయటకొచ్చి పెట్టుకున్న మరో కమ్యూనిస్టు పార్టీ. సీపీఐ కన్నా మాస్ బేస్ ఉన్న పార్టీగా గుర్తింపు వచ్చింది. బెంగాల్, కేరళ, ఆంధ్రా ల్లో మెజార్టీ సీపీఐ నాయకులు సీపీఎంలోకి వచ్చారు. ఆంధ్రాలో 1967 లో సీపీఐ నుంచి వచ్చిన నక్సలైట్ చీలికలో చేరిపోయారు. ఆంధ్రాలో అతిరథ మహారథులు అందరూ సీపీఐ నుంచి బయటకొచ్చి సీపీఎంలో చేరారు. శ్రీకాకుళం సీపీఐకి అత్యంత బలమైన యూనిట్ గా ఉండేది. యూనిట్ మొత్తం నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లింది.
బెంగాల్, కేరళలో అధికార పార్టీగా సీపీఎం ఎదిగింది. ఒకసారి గెలిచి మరోసారి ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కేరళలో మాత్రమే సీపీఎం అధికారంలోకి వచ్చింది. 60 ఏళ్లలో సీపీఎం అధ: పాతాళానికి కూలిపోయింది.
సీపీఎం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.. చారిత్రక తప్పదం అని చెంపలేసుకోవడం అనాదిగా వస్తోంది.ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ లో కోజికూడ్ లో సీపీఎం 24వ కాన్ఫరెన్స్ జరుగబోతోంది.. అందులో ముసాయిదా తీర్మానం ఏంటంటే.. బీజేపీ ఫాసిస్ట్ పార్టీ కాదు.. మోడీ ఫాసిస్ట్ పార్టీ కాదు.. కనీసం నయా ఫాసిస్ట్ ప్రభుత్వం కూడా కాదు.. అంటూ తీర్మానించి మరో చారిత్రక తప్పిదం చేయబోతోంది.
కేరళ సీపీఎం నయా ఉదారవాద పంథాకి జై కొడుతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.