spot_img
Homeక్రైమ్‌divorce case reunited : ఐదేళ్లపాటు విడాకుల కోసం కోర్టు చుట్టూ.. చివరికిలా కలిశారు.. సినిమాను...

divorce case reunited : ఐదేళ్లపాటు విడాకుల కోసం కోర్టు చుట్టూ.. చివరికిలా కలిశారు.. సినిమాను మించిన స్టోరీ ఇది

divorce case reunited : విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగారు. ఐదు సంవత్సరాలపాటు విడాకుల కోసం పోరాడారు.. పెద్దలు.. కోర్టులో న్యాయాధికారులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. మరి కొద్ది రోజుల్లో విడాకులు మంజూరు అవుతాయనుకుంటున్న క్రమంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ నగరానికి చెందిన సౌరబ్ అనే వ్యక్తికి 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మొదట్లో చిన్నపాటి గొడవ.. ఆ తర్వాత మరింత పెరిగింది. దీంతో ఇద్దరూ విడిగా ఉండాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.. విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. పరస్పరం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా విడాకుల కోసం ఫ్యామిలీ కోటు చుట్టూ తిరుగుతున్నారు..

న్యాయవాదుల ఫీజులు.. ఇతర ఫీజులకు సంబంధించిన ఖర్చులు వంటి వాటి వల్ల రెండు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇటీవల ఈ బాధతో శిఖ తండ్రి గుండెపోటు గురయ్యాడు. డబ్బు మొత్తం కోర్టు కేసులకు ఖర్చు కావడంతో.. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించే స్థాయి లేకుండా పోయింది. దీంతో అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సౌరబ్..శిఖ తండ్రిని గురు గ్రామ్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించాడు. మెరుగైన వైద్యం అందించడానికి తనవంతుగా సహకారం అందించాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఇటీవల విడాకుల కేసు విచారణకు సంబంధించి సౌరబ్..శిఖ కోర్టుకు హాజరయ్యారు. వారిద్దరి తరపున న్యాయవాదులు వాదనను వినిపించడం మొదలుపెట్టారు.. కేసు తుది విచారణలో భాగంగా విడాకులు తీసుకుంటారా అని అడిగారు. వెంటనే శిఖ సినిమా స్టైల్ లో తన చేతిలో ఉన్న విడాకుల పత్రాలను చించేసింది. తన భర్తతో విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కలిసి ఉంటామని వివరించింది. మొత్తంగా ఐదు సంవత్సరాలపాటు విడాకులు తీసుకుంటామని అనుకున్న వారిద్దరు.. ఐదు నిమిషాల్లో కలిసిపోయారు. సినిమా స్టోరీని కళ్ళ ముందు ఉంచారు. నేటి కాలంలో చిన్న చిన్న ఘటనలకే గొడవ పడుతున్న వారికి ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారు.


image.png

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular