
తనపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులకు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తు పేరుతో పోలీసులు వేధించడం రాజ్యాంగ విరుద్ధమని తీన్మార్ మల్లన్న తన పిటిషన్ లో పేర్కొన్నారు. సీసీఎస్, చిలకగూడ పోలీస్ స్టేషన్ లో తనపై కేసులు నమోదు చేశారని, స్టేషన్ కు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు.