
ఆంధ్రప్రదేశ్ లోని కృష్టా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రోగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామానికి చెందిన పోలిబోయిన రోశయ్య (50) గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.