
దేశ రాజధానిని వణికించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజివాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా ఇటీవల ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని గడిచిన 24 గంటల్లో 6500 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నగరంలో పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గిందని చెప్పారు. దేశ రాజధానిపై కరోనా వైరస్ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు.