
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న 41 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా తాజాగా 47వేలకు పైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 509 మంది మరణించారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. 3,20,28,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి.