
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు దిగి వస్తుండడం ఊరట కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. 81రోజుల తర్వాత 60 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కొత్తగా 87,619 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. మరో వైపు 24 గంటల్లో 1,576 మరణాలు నమోదయ్యాయని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965కు పెరిగాయి.