
రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెసిడెన్షియల్ మినహా మిగతా అన్ని పాఠశాలలను తెరుచుకునేందుకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక్ష విద్య బోధనకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రత్యేక్ష బోధన వద్దని వేసిన ఆ పిటిషన్ పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రత్యక్ష బోధన కోసం పాఠశాలలకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు సూచించింది.