Chiranjeevi comments on Peddi గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మూత పడిపోనున్న థియేటర్స్ ని మరోసారి తెరిపించి , జనాల తో కిక్కిరిసిపోయేలా చేసింది. సంక్రాంతి తర్వాత మేకర్స్ కి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్ గా మారింది. విడుదలైన ప్రతీ సినిమా డిజాస్టర్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకున్నారు కానీ , ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. దీంతో ట్రేడ్ ‘పెద్ది’ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతుంది. 10 రోజుల్లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి , డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘పది రోజుల నుండి నా కొత్త సినిమా షూటింగ్ పొలాచ్చి లో ఉండడం తో బిజీ గా ఉండడం వల్ల, పెద్ది చిత్రాన్ని చూడలేకపోయాను. నిన్న ఇక్కడికి రాగానే , ఈ సినిమాని చూశాను , చాలా గొప్పగా అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఆ మూడ్ నుండి బయటకు రావడం చాలా కష్టమైంది. అంతటి అద్భుతంగా ఈ చిత్రాన్ని నువ్వు తెరకెక్కించావు. నీ బుర్రలో వచ్చిన గొప్ప ఆలోచనని , వెండితెర మీద ఎమోషనల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యావు. ఈ సినిమాలో చరణ్ అసలు నటించలేదు, జీవించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు అందరూ ముక్తకంఠం తో ‘చరణ్ జీవి’ అని అంటున్నారు సార్ అని చిరంజీవి తో బుచ్చి బాబు చెప్పగా, చిరంజీవి అందుకు కూడా చాలా ఎమోషనల్ గా రెస్పాన్స్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘చరణ్ నాకు నేషనల్ అవార్డు ని సాధిస్తే ఎంత సంతృప్తి ఇస్తుందో , అంతకు మించిన సంతృప్తిని ఇచ్చేసాడు. ఒక తండ్రి గా , తోటి నటుడిగా ఎంతో గర్వకారణం గా నిలిచాడు. తండ్రిని ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు , ప్రేక్షకులే మాట్లాడేశారు నా బిడ్డ నటన గురించి. ఇక్కడ నాకు పెద్దలు చెప్పిన ఒక సామెత గుర్తుకొస్తుంది. పుత్రోత్సాహం బిడ్డని కన్నప్పుడు కాదు , ఆ బిడ్డ సాధించిన విజయాలను నలుగురు గుర్తించినప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని, దాని అనుభవం చరణ్ నాకు ఎన్నో సార్లు కలిగించేలా చేశాడు ‘ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇంకా ఆయన ఈ ఇంటర్వ్యూ లో ఏమేమి మాట్లాడాడో మీరే చూడండి. మెగా ఫ్యాన్స్ కి ఈ ఇంటర్వ్యూ ఒక విజువల్ ఫీస్ట్ అనుకోవచ్చు.

