https://oktelugu.com/

China virus : చైనాలో మరో వైరస్ ఉధృతి.. వణికి పోతున్న డ్రాగన్ కంట్రీ.. ప్రపంచానికి ముప్పు తప్పదా?

China virus : చైనా (China).. ఈ పేరు చెబితే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఎందుకంటే కోవిడ్(Covid virus) సృష్టించిన విలయం అటువంటిది కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు మొత్తం కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డాయి. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇలాంటి పరిస్థితే నెలకొంది.

Written By: , Updated On : February 21, 2025 / 09:57 PM IST
Follow us on

China virus : కోవిడ్ మ్యూటేషన్లు రకరకాలుగా ఉండడంతో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచం ఆ వైరస్ వల్ల ఇబ్బంది పడింది. ఒక వైరస్ కాగానే మరొక వైరస్ దాడి చేయడంతో ప్రపంచ దేశాలకు పాలు పోలేదు. చివరికి భారత్ వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. ప్రపంచ దేశాలకు ఆశలు చిగురించాయి. అంతటి అమెరికా కూడా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ కనుకొనడంలో విఫలమైంది. చివరికి భారత్ అందించిన వ్యాక్సిన్లే అమెరికా లాంటి దేశాలకు దిక్కయ్యాయి. కొన్ని దేశాలైతే భారత్ నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకున్న తర్వాత.. కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా లైట్ షో కూడా ఏర్పాటు చేశాయి.. కోవిడ్ అనంతరం రకరకాల వైరస్ లు చైనాలో వెలుగు చూసాయి. అయితే ఈ సమాచారాన్ని బయటకు తెలియకుండా చైనా జాగ్రత్త పడినప్పటికీ.. సోషల్ మీడియా వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలిసింది. కోవిడ్ వల్ల చైనాలో దాదాపు మూడు సంవత్సరాల పాటు దశలవారీగా కఠినమైన ఆంక్షలు విధించారు. జనాలను బయటకు వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.. ఈ క్రమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది మతిస్థిమితాన్ని కూడా కోల్పోయి పిచ్చివాళ్లుగా ప్రవర్తించారు. అటువంటి వారికి చికిత్స పేరుతో.. చైనా చిత్రహింసలు పెట్టిందని ఆరోపణలు వినిపించాయి. కోవిడ్ నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి చేదు వార్త ఒకటి వినిపిస్తోంది. ఎందుకంటే చైనా దేశాన్ని ప్రస్తుతం మరో కొత్త వైరస్ వణికిస్తోంది.

ఏమిటి ఆ కొత్త వైరస్

చైనాలో కోవిడ్ మాదిరిగానే మరో కొత్త వైరస్ ప్రబలినట్టు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు ఆ వైరస్ కు HKU5 – COV – 2 అని పేరు పెట్టారు. ఈ వైరస్ ను గబ్బిలాలలో గుర్తించారు. అయితే కరోనా మాదిరిగానే ఇది కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వైరస్ మెర్బెకో, మెర్స్ కోవ్ ఉపరకానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ను హాంకాంగ్ లోని జపనీస్ పీపీ స్త్రైల్ గబ్బిలాలో శాస్త్రవేత్తలు గుర్తించారు.. అయితే ఈ వైరస్ మనుషుల్లో అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. విపరీతమైన జ్వరం.. కాళ్ల నొప్పి.. కీళ్లనొప్పి.. దగ్గు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. రక్తపోటు తగ్గిపోవడం వంటి సమస్యలు ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయి. అయితే దీనికి చైనాలో ఎటువంటి చికిత్స చేస్తున్నారనేది తెలియ రాలేదు. చాలా ప్రాంతాలలో ఈ వైరస్ వల్ల ప్రజలు ఆసుపత్రి పాలైన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్నాయి. అయితే దీనిపై చైనా ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ వైరస్ వల్ల ఇంతవరకు మరణాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే కోణాలలో పాశ్చాత్య మీడియా సంస్థలు వార్త కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇది సహజ సిద్ధంగా వచ్చిందేనా? లేక చైనా ప్రపంచం మీదికి కొత్త వైరస్ ఏమైనా వదిలిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ వల్ల ప్రపంచానికి ముప్పు తప్పదా అనే భయాలు కూడా కలుగుతున్నాయి.