
ఐపీఎల్ 2021 రెండో దశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 28న ప్రారంభంకాగా సెప్టెంబర్ 19న ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ లోని మిగతా మ్యాచ్ లను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వమించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే సీపీఎల్ రీషెడ్యూల్ కోసం బీసీసీఐ ప్రయత్నాతు చేస్తున్నది. సీపీఎల్ ను కొన్ని రోజుల ముందుగానే పూర్తి చేయగలిగితనే బయో బబుల్ కు ఆటగాళ్లను బదిలీ చేయడానికి సులువు అవుతుందని బీసీసీఐ అధికారి తెలిపారు.